Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి ప్రభుత్వ నిర్వాకం
లక్నో: ఉత్తరప్రదేశ్లో క్రీడాకారి ణులకు అవమానం జరిగింది. రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్లో అధి కారులు బాలికలకు టాయిటెట్లలో భోజనాలు ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాయిలెట్ గదిలో అన్నం, పప్పు, కూరల పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్న దశ్యాలు ఆ వీడియో లో ఉన్నాయి. మరో వీడియోలో వండిన పదార్థాలను స్విమ్మింగ్ పూల్ దగ్గరి కి తీసుకువెళ్తున్న దశ్యాలు ఉన్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే.. సహరన్పుర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీన అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీలకు హాజరైన వారికి స్టేడియం టాయిలెట్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంపై సహరన్పుర్ క్రీడా అధికారి అనిమేశ్ సక్సేనా స్పందించారు. భోజనాలను టాయిలెట్లో ఏర్పాటు చేయలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వంట పాత్రలను 'ఛేంజింగ్ రూం' (బాత్ రూం)లో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణ దశలో ఉంది. వర్షం కారణంగా వంట పాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న ఛేంజింగ్ రూంలో పెట్టాం'' అని సక్సేనా చెప్పారు.
దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సహరాన్పూర్ స్పోర్ట్ అధికారి అనిమేష్ సక్సేనాతో పాటు జిల్లా స్పోర్ట్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, మూడు రోజుల్లో నివేదిక ను సమర్పించాలని, తగిన చర్యలు తీసుకుంటామని సహరాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ అన్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రచారాలకు కోట్లు ఖర్చు పెడుతోన్న బిజెపి ప్రభుత్వానికి క్రీడాకారులకు తగిన సౌకర్యాలు కల్పించేందుకు మాత్రం డబ్బుల్లేవని కాంగ్రెస్ విమర్శించింది. క్రీడాకారులను బిజెపి ఎంతగా గౌరవిస్తుందనడానికి ఈ ఘటన నిదర్శనమని.. కబడ్డీ క్రీడాకారులకు బాత్రూంలో భోజనాలు వడ్డించడం సిగ్గుచేటని టిఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డీ ట్వీట్ చేశారు.