Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కె. రాధాకృష్ణన్ చైర్మెన్‌గా ఆహ్వాన సంఘం
త్రిసూర్ : దేశంలో రైతు ఉద్యమ సారధి అఖిల భారత కిసాన్‌సభ (ఏఐకేఎస్) 35వ అలిండియా మహాసభలు డిసెంబర్ 13 నుంచి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో జరగను న్నాయి. మహాసభలు నిర్వహ ణ కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. కేరళ దేవదాయ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ చైర్మెన్‌గా, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఎసి మొయితీన్ జనరల్ కన్వీనర్‌గా, రైతు సంఘం జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు ఎంఎం వర్గీస్ కోశాధికారిగా 275 మంది ఎగ్జిక్యూ టివ్ సభ్యులతో ఆహ్వానం సంఘం ఏర్పాటు చేశారు. కేరళలోని త్రిసూర్ లోని బ్యాంక్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి ఎంవి గోవిందన్ మాస్టార్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం విజయకుమార్ అధ్యక్షత వహించారు. దేవదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్, ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్, రాష్ట్ర కార్యదర్శి వత్సన్ పనోలి, జిల్లా కార్యదర్శి ఎఎస్ కుట్టి మాట్లాడారు. ఆహ్వాన సంఘంలో చీఫ్ ప్యాట్రన్స్‌గా ఎస్. రామచంద్రన్ పిళ్లై, ఈపీ జయరాజన్, ప్యాట్రన్స్‌గా ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు, మాజీ ఎంపీ పికె బిజు, కేరళ సాహిత్య అకాడమీ అధ్యక్షులు, ప్రముఖ కవి కె సచ్చిదానందన్, కథకలి ప్రముఖ కళాకారుడు కళామండలం గోపి, త్రిసూర్ మేయర్ ఎంకె వర్గీస్, మాజీ ఎంపీ, సినీ నటుడు ఇన్నోసెంట్ ఉన్నారు. అలాగే కవులు, కళాకారులు, రచయితలు, రాజకీయ నేతలు, విద్యావేత్తలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.