Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కీలక కేసుల విచారణలో జాప్యం సమస్యను సంక్లిష్టంగా మారుస్తాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చందర్ ఉదరు సింగ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు సీజేఐ యు.యు.లలిత్ శక్తిని, పరిపూర్ణతను తీసుకువచ్చారని అన్నారు. జాతీయ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కేసుల ఆవశ్యకతను గుర్తించిన ప్పటికీ.. కీలకమైన కేసుల విచారణ ఆలస్యమవుతుందనే వాదన కూడా ఉం దని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణకు కాకుండా రాజకీయ వ్యవస్థ వైపు సుప్రీంకోర్టు మొగ్గు చూపుతుందన్న అభిప్రాయం కూడా ఉందని చెప్పారు. సీఏఏ, ఆర్టికల్ 370, పెగాసెస్ వంటి ముఖ్యమైన కేసులు కోర్టులో పెం డింగ్‌లో ఉన్నాయని.. వీటి విచారణను జాప్యం చేయడంతో సమస్య సం క్లిష్టంగా మారుతుందని చందర్ పేర్కొన్నారు. ఉదాహరణకు సెంట్రల్ విస్టా నిర్మాణంపై మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉందనీ.. కానీ సెంట్రల్ విస్టా నిర్మాణం పూర్తయిం దని చెప్పారు. అలాగే ఉమర్ ఖలీద్ కేసు గురించి కూడా వివరించారు.