Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక సీఎం బొమ్మై
బెంగళూరు:పాఠశాల బోధనాంశాల్లో భగవద్గీతను ప్రవేశ పెట్టడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. భగవద్గీత కాకపోతే మరే అంశం ద్వారా విద్యార్థులు నైతిక విలువలు నేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. పోటీ యుగంలో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం ఉందని, భగవద్గీతను సిలబస్లో భాగం చేస్తే వారి మేధస్సు పెంపొందుతుందని అన్నారు. 2022 -23 విద్యా సంవత్సరం నుంచి 6 -12 తరగతులకు భగవద్గీత సిలబస్లో భాగంగా ఉంటుందని గతవారం గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చారని, తమ మంత్రి వర్గం లోకూడా ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారని బొమ్మై పేర్కొన్నారు. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో భగవద్గీతను చేర్చే విషయంలో తొంద ర పడటం లేదనీ, అమలుచేసే ముందు చర్చించాలని హోం మంత్రి అర గజ్ఞానేంద్ర పేర్కొన్నారు. ఎందరో ప్రముఖలను భగవద్గీత ప్రభావితం చేసిందని, భగవ ద్గీత ప్రజలను మంచిమనుషులుగా జీవించేందుకు తోడ్పడుతుందని చిక్ మంగుళూరు బీజేపీ కార్యదర్శి అన్నారు. మరోవైపు పాఠశాల బోధనాంశాల్లో భగవద్గీతను చేర్చడంపై తమకు అభ్యం తరం లేదని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొనడం గమనార్హం.