Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : సోలర్ ప్లాంట్ల కోసం రూ.19,500 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పీఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చింది. అలాగే పీఎల్ఐ స్కీమ్ కిందకు సోలార్ ప్యానెళ్లను తెచ్చారు. సెమీ కండక్టర్ల అభివృద్ధి కార్యక్రమానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 17న ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని కేంద్రం ఆమోదించింది. 2030 నాటికి టాప్ 25 దేశాల్లో చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది.