Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రతన్ టాటా, కెటి థామస్, కరియా ముండా
- మరో ముగ్గురుతో సలహా మండలి
- ప్రధాని మోడీ అధ్యక్షతన పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీ బోర్డు భేటీ
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా మరో ముగ్గురు సభ్యులను నియమించారు. పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, ఆర్ఎస్ఎస్ సానుభూతి పరుడు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్, బీజేపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాలను నియమించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీ బోర్డు సమావేశం బుధవారం జరిగింది. పీఎం కేర్స్ ఫండ్ సాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, 4,345 మంది బాలలకు సంబంధించిన పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీమ్ఫై ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా కెటి థామస్, రతన్ టాటా, కరియా ముండాలను నియమించారు. అలాగే ముగ్గురు సభ్యులతో పీఎమ్ కేర్స్ ఫండ్‌కు సలహా మండలి (అడ్వైజరీ బోర్డు)ని ఏర్పాటుచేశారు. రాజీవ్ మోహర్షి (మాజీ కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా), సుధమూర్తి (ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్), ఆనంద్ శాV్‌ా (టీచ్ ఫార్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పీరామల్ ఫౌండేషన్ మాజీ సీఈఓ)లతో సలహా మండలిని ఏర్పాటుచేశారు. పిఎం కేర్స్ ఫండ్‌కు చందాలను ఇస్తున్నందుకు దేశ ప్రజలను మోడీ ప్రశంసిం చారు. ఈ సమావేశానికి ట్రస్టీలు కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.