Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికపై ఆ పార్టీ ఇచ్చిన వివరణను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అంతేకాకుండా శాశ్వత పదవి ప్రజా స్వామ్య విరుద్ధమని ఘాటుగా స్పందించింది. ఈ మేరకు బుధవారం వైసీపీ ప్రధాన కార్యదర్శి (వి.విజయసాయి రెడ్డి)కి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయ్దేబ్ లాహిరి రెండు పేజీల ఉత్తర్వులను పంపించారు.