Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలుత రాజ్యాంగ ధర్మాసనం కేసులు
- సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం
- సీజేఐ జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో న్యాయమూర్తుల ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసేం దుకు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న కీలక నిర్ణయాన్ని ఏక గ్రీవంగా తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నది. అందుకనుగుణంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సుప్రీం కోర్టు సిబ్బంది ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్నిరోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్ చేయాలని నిర్ణయిం చినట్టు సమాచారం. ప్రత్యక్ష ప్రసారా ల కోసం త్వరలోనే సుప్రీం కోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారు చేస్తుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు గతం లోనే పడింది. కోర్టు చరిత్రలోనే తొలి సారిగా జస్టిస్ ఎన్వి రమణ సీజేఐ గా పదవీ విరమణ చేసే రోజు (ఆగస్టు 26) ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సుప్రీం కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సహా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. 2018లో కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న ప్పటికీ ఆచరణలోకి రాలేదు. తాజాగా వచ్చే వారం నుంచి లైవ్ స్ట్రీమింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు.