Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ రూ.25వేల కోట్లు
- జీడీపీలో ప్రభుత్వ వ్యయం 0.1శాతం : సేవ్ ద చిల్డ్రన్
న్యూఢిల్లీ : చిన్నారుల మెదడులో కీలక మార్పులు, అభివృద్ధి 6ఏండ్లలోపు జరుగుతుంది. ఈనేపథ్యంలో 3 నుంచి 6ఏండ్ల వయస్సున్న చిన్నారుల కోసం ఏర్పాటుచేసిందే అంగన్వాడీ, ప్రీ-ప్రైమరీ స్కూల్స్. అయితే మనదేశంలో 68శాతం మంది బాలలు ఈ విద్యా సేవలను పొందలేకపోతున్నారని, బాలల ప్రారంభ విద్య 32శాతం మంది చిన్నారులకు పరిమితమైందని 'సేవ్ ద చిల్డ్రన్' సంస్థ నివేదిక విడుదల చేసింది. 3 నుంచి 6ఏండ్ల బాలలకు అంగన్వాడీ, ప్రీప్రైమరీ విద్యా సేవలన్నీ అందుబాటులోకి రావాలంటే దేశ జీడీపీలో 1.5 శాతం నుంచి 2.2శాతం నిధులు కేటాయించాల్సిన అవసరముందని నివేదిక అభిప్రాయపడింది. బాలల ప్రారంభ విద్య కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2020-21లో రూ.25 వేలకోట్లు బడ్జెట్ కేటాయింపులు చేశాయి. ఇది దేశ జీడీపీలో కేవలం 0.1శాతానికి సమానం.
2011 జనాభా లెక్కల ప్రకారం బాలల ప్రారంభ విద్యను అందుకునే పిల్లలు మనదేశంలో 9.9కోట్ల మంది ఉంటారని ఒక అంచనా. వీరందర్నీ అంగన్వాడీ, ప్రీప్రైమరీ స్కూల్స్ సేవల పరిధిలోకి తీసురావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మొత్తంలో నిధుల కేటాయింపు చేయాల్సి వుంటుంది. అయితే నిధుల వ్యయం రూ.25వేల కోట్లకు పరిమితం కావటం 32శాతం మంది బాలలకే సేవలు దక్కుతున్నాయి. నిధుల వ్యయం, పంపిణీపై పర్యవేక్షణ పెంచాలని నివేదిక సూచించింది. నిర్బంధ బాలల ఉచిత విద్య సేవలు (ఈసీఈ) సమర్థవంతంగా అమలు జేసేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని, పర్యవేక్షణ, పరిశీలన పెంచాలని తెలిపింది. ప్రతి పిల్లాడిపై సగటు వ్యయం రూ.32వేల నుంచి రూ.56వేల మధ్య ఉండాలని సూచించింది.