Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
న్యూఢిల్లీ : కర్నాటకలో తరగతి గదుల్లో ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసుకుంది. ఇరు పక్షాల వాదనలను 10 రోజుల పాటు విన్న అనంతరం జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు దౌలియాలతో కూడిన బెంచ్ తీర్పును చెప్పకుండా వాయిదా వేసింది. నిర్దేశించిన స్కూలు యూనిఫారాలను విద్యార్ధులు ధరించేలా నిబంధనలను పాటించాలంటూ విద్యాసంస్థలను ఆదేశించే అధికారం తమకు వుందని కర్ణాటక ప్రభుత్వం కోర్టులో వాదించింది. మతాలకు అతీతంగా ఇచ్చే ఈ ఆదేశాలు విద్యార్ధుల మధ్య తేడాలు లేకుండా చూసేందుకు, సమాత్వాన్ని పెంపొందించేందుకు జారీ చేసేవేనని పేర్కొంది. పైగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమాల ద్వారా హిజాబ్ వివాదాన్ని లేవనెత్తుతోం దని ఆరోపించింది. కాగా హిజాబ్‌పై నిషేధం విధిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చి న తీర్పును విద్యార్ధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించడమనేది ఇస్లాం సాంప్రదాయం కాదని హైకోర్టు తేల్చింది. మరోపక్క విద్యార్ధుల తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవె మాట్లాడుతూ తరగతి గదుల్లో ప్రాథమిక హక్కులు, ఏ దుస్తులు ధరించాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటి హక్కులు అదృశ్యం కారాదని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం తను చెబుతున్న దానికి తగిన సాక్ష్యాధారాలను చూపించడం లేదని అన్నారు. హైకోర్టులో గతంలో ప్రస్తావించని పాపులర్ ఫ్రంట్ అంశాన్ని ఈసారి లేవనెత్తిందని, పైగాఇందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను కూడా ప్రవేశపెట్టలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
వైవిధ్యతకు విద్యార్ధులు ఎలా సిద్ధమవుతారు ?
చదువుకునే తరగతి గదుల్లోనే విద్యార్ధులు దేన్నీ అనుమతించనపుడు ఇక మన దేశ మహత్తర వైవిధ్యతను ఎదుర్కొనడానికి వారెలా సిద్ధపడతారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుధాంశు దౌలియా విస్మయాన్ని వ్యక్తం చేశారు.