Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోచి : బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై పోరు సల్పేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్ధాంతాలతోపాటు ఆర్థిక, వ్యవస్థాగత అధికారాలపై పోరాడాలని కోరారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కోచిలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శక్తులపై పోరాడటం చాలా కీలకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పెండింగ్లో వున్న సంస్థాగత ఎన్నికల గురించి, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా రాహుల్ దాటవేశారు. అధ్యక్షుడిగా వుండే వ్యక్తికి తనదొక సలహా అంటూ 'చారిత్రకమైన పదవిని చేపడుతు న్నప్పుడు దానికంటూ కచ్చితమైన సిద్ధాంతాలు, విశ్వాస వ్యవస్థ వుంటా యి. వాటిని పూర్తిగా నమ్మగలిగే, ఆచరించే వారు అందులో వుండాలి' అని సూచిం చారు. కాంగ్రెస్ కార్యకర్తలెవరైనా ఆ పదవికి పోటీ పడవచ్చన్నారు. ఉదరుపూర్ చింతన్ శిబిర్లో 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అనే సిద్ధాంతానికి మద్దతు ఇచ్చామనీ, ఇది కొనసాగు తుందని ఆశిస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో రాజస్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాంగ్రెస్ అధ్య క్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాజస్థాన్ ముఖ్య మంత్రిగాను కొనసాగుతానంటూ ఇటీవల గెహ్లాట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను అధ్యక్ష పీఠాన్ని చేపడితే.. తన ప్రత్యర్థి సచిన్ పైలెట్ సిఎం అవుతారని ఆయన భావిస్తు న్నారు. రాహుల్ వ్యాఖ్యలతో.. అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడైతే.. సిఎం పదవిని వదులుకోక తప్పదని స్పష్టమైంది. అదే జరిగితే స్పీకర్ సిపి జోషిని సిఎం చేయాలని గెహ్లాట్ సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది.
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ జారీ
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుద లైంది. ఈ నెల 24 నుంచి 30 వరకూ నామినేషన్లు దాఖలు చేయ వచ్చు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, 8 వరకూ ఉపసంహరణకు గడువు. అక్టోబర్ 17న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఈ రేసులో రాజ స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేతలు శశిథరూర్, కమల్ నాధ్, మనీష్ తివారీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య పేర్లు వినిపిస్తున్నాయి.