Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ జర్నలిస్ట్ విజ్ఞప్తి
శ్రీనగర్: ఖైదు చేయబడిన కాశ్మీర్ వేర్పాటువాద నేత, తన తండ్రి అల్తాఫ్ అహ్మద్ షాకికి చికిత్సనందించేందుకు అనుమతించాలని కాశ్మీర్ జర్నలిస్ట్ రువా షా కోరారు. తన తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందనీ, జైలు బయట ఆస్పత్రిలో తగిన చికిత్స అందించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (పీఎం ఓ), హోంమంత్రి కార్యాలయం (హెచ్ఎంఓ)లకు వరుస ట్వీట్లు చేశారు. తన తండ్రి నిమోనియా, తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధ పడుతు న్నారనీ, షుగర్ కూడా పెరిగిపోయిందనీ, ప్రస్తుతం తీహార్ జైలులోని ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొ న్నారు. విచారణ సమయంలో ఎటువంటి చట్టపరమైన చర్యలైనా తీసుకోవచ్చు కానీ.. ఆలస్యం కాకుండా ఆయనకు వైద్య సంరక్షణ అందించడం అత్యవస రమని పేర్కొన్నారు.
కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఈ-హురియ త్ వ్యవస్థాపకుడైన సయ్యద్ అహ్మద్ షా గిలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా. ఉగ్రవాదం కోసం పాకిస్తాన్ నుంచి నిధులు సేకరిస్తున్నా రన్న ఆరోపణలతో అల్తాఫ్ సహా ఏడుగురు వేర్పాటువాద నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2017లో అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి అల్తాఫ్ తీహార్ జైలులోనే ఉన్నారు.