Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సీఎంగా ఉండగా అదానీ కెమికల్స్‌కు 5వేల ఎకరాల అటవీ భూములు
న్యూఢిల్లీ : పోడు భూముల్లో గిరిజనులు, ఆదివాసీలు అర ఎకరా సాగు చేసుకుంటే పోలీసులు, అటవీ సిబ్బంది రంగంలోకి దిగిపోయి నానా రభస చేస్తుంటారు. అదే..ఏ బడా కార్పొరేట్ తన ఆర్థిక, రాజకీయ బలంతో 5వేల ఎకరాలు ఆక్రమించుకుంటే ఎవ్వరూ నోరు మెదపరు. గుజరాత్లో బీజేపీ అండదండలతో అదానీ, అంబానీ రాజ్యం అక్కడ ఎప్పడ్నుంచో నడుస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 'ప్రజా పద్దుల కమిటీ' (పీఏసీ) తాజా నివేదిక. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, నిబంధనలకు పాతరేశారని, ఆనాటి సీఎంగా నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం శరవేగంగా ప్రాజెక్ట్‌కు అనుమతులు మంజూరు చేయటం పలు సందేహాలకు తావిస్తోందని 'పీఏసీ' కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 2009లో కచ్ జిల్లాలోని దాదాపు 5వేల ఎకరాల అటవీ భూములు అదానీ కెమికల్స్‌కు అప్పనంగా కేటాయించారని నిర్ధారించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పంజా వంశ్ నేతృత్వంలోని పీఏసీ బృందం తన (ఐదవది) నివేదికను రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీకి అందజేసింది.
నిజానకి ఈ ప్రాజెక్ట్‌లోని అక్రమాల్ని తొలుత కాగ్ నివేదిక బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని వెల్లడించింది. మళ్లీ దీనిపై పీఏసీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి కాగ్ పేర్కొన్నది నిజమేనని తేల్చింది. పీఏసీ కమిటీ సెప్టెంబర్ 25, 2019న జరిగిన సమావేశానికి హాజరైన రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఉన్నతాధి కారులు ఆ భూములు ఎకో క్లాస్-4 కేటగిరి కిందకు రావటంపై సందేహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారుల తనిఖీ నివేదిక ప్రకారం ఎకో క్లాస్-2గా వర్గీకరణ కావాలి కదా ? అని ప్రశ్నిస్తే అటవీ, పర్యా వరణ అధికారుల నుంచి సరైన సమాధానం రాలే దు. జరిగిన తప్పు తెలిసినప్పటికీ బీజేపీ ప్రభుత్వ పెద్దలు దీనిపై నోరు మెదపలేదు. అదానీ కెమికల్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం రాబట్టలేదు. భూముల ఎన్పీఏ విషయంలో జరిగిన పొరపాట్లను సరిచేసి..రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును అదానీ కంపెనీ నుంచి వసూలు చేయా లని 'పీఏసీ' సిఫారసు చేసింది. అక్రమాలకు పాల్ప డిన అధికారులపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
అదానీకి లబ్ది చేయటమే పరమావధి
అటవీ భూముల్ని ఆరు కేటగిరీలుగా వర్గీకరిస్తూ సుప్రీంకోర్టు మార్చి, 2008లో తీర్పు వెలువరించింది. దీని ప్రకారం అటవీ భూములపై ఆయా కేటగిరీల 'నెట్ ప్రెజెంట్ వాల్యూ' (ఎన్పీఏ) అన్నది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంటుంది. ఈమేరకు కచ్‌లోని అటవీ భూములు 'ఎకో క్లాస్-2' కేటగిరి కిందకు వస్తాయి. వీటి ఎన్పీఏ హెక్టారుకు రూ.7.30లక్షలుగా లెక్కగట్టాలి. అయితే అదానీ ప్రాజెక్ట్‌కు కేటాయించిన భూములన్నీ ఎకో క్లాస్-4గా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారుచేసింది. ఎన్పీఏ రూ.4.30లక్షలుగా నిర్ణయిస్తూ..కేవలం రూ.87కోట్ల రూపాయలు అదానీ కెమికల్స్ నుంచి వసూలు చేసింది. సంబంధిత ప్రాజెక్ట్‌కు తొలుత 2004లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2009లో కేంద్రానికి కొత్తగా ప్రతిపాదనలు పంపింది. ధారబ్, ముంద్రా గ్రామాల్లో దాదాపు 5వేల ఎకరాల అటవీ భూములను సేకరించినట్టు తెలిపింది.