Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ యుయు లలిత్
- అక్టోబర్ 3 నుంచి వారం రోజుల పాటు దసరా సెలవులు
- తిరిగి అక్టోబర్ 10న పున్ణప్రారంభం
న్యూఢిల్లీ : దసరా సెలవుల తరువాత జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 20కి పైగా పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు అయ్యాయి. దాదాపు రెండు సంవత్సరాలు (2020 మార్చి 2 నుంచి)గా ఈ పిటిషన్లు విచారణ జరగలేదు. అయితే శుక్రవారం ఈ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని సీజేఐ యుయు లలిత్ ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ప్రశాంతో సేన్ అత్యవసరంగా ప్రస్తావించారు. దీనికి జస్టిస్ లలిత్ స్పందింస్తూ ''అవును దసరా సెలవుల తరువాత జాబితా చేస్తాం'' అని అన్నారు. సుప్రీం కోర్టుకు అక్టోబర్ 3 నుంచి వారం రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 10న సుప్రీం కోర్టు తిరిగి పున్ణప్రారంభం అవుతుంది. 2019 డిసెంబర్లో ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఆర్టికల్ 370ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాల్సిన అవసరం లేదని 2020 మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.
ఈ ధర్మాసన సభ్యుల్లో జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి పదవీ విరమణ చేశారు. దీంతో సీజేఐ యుయు లలిత్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయింది.