Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచి : ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు రాజ స్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కోచిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ రాజస్థాన్ వెళ్లిన తరువాత నామినేషన్ దాఖలు చేసే తేదీని వెల్లడిస్తానని చెప్పారు. గురువారం కోచి వచ్చిన ఆయన భారత్ జోడో యాత్రకు సారధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని కలిసి చర్చించారు. శుక్రవారం గెహ్లాట్ మాట్లాడుతూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి వారసుడు ఎవరనే అంశాన్ని పార్టీ నాయకురాలు సోనియాగాంధీ, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అజరు మాకెన్ నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న నిర్వహించి, 19న ఫలితాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు రాజస్థాన్ సిఎం పదవి కూడా నిర్వహించాలని తొలుత గెహ్లాట్ భావించారు. గతంలో నిర్ణయించుకున్న ప్రకారం ఒకరికి ఒక పదవే వర్తిస్తుందన్న రాహుల్ ప్రకటన, సోనియా, రాహుల్‌లతో చర్చించిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు గెహ్లాట్ తాజాగా ప్రకటించారు.