Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సహాయంపై కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి దేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు సహాయం చేసేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనలపై తాము కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియా ధర్మాసనం పిటిషన్ విచారించింది. ఈ సమస్యపై అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయని విద్యార్థుల తరపు న్యాయవాది తెలిపారు. దాదాపు 13,000 మంది వైద్య విద్యార్థులు ప్రభావితమవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్ ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు ప్రత్యామ్నాయాలు కల్పించే విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు అన్ని తమ పని చేస్తున్నాయని తెలిపారు.