Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ఢిల్లీ తదుపరి డైరెక్టర్‌గా డాక్టర్ ఎం శ్రీనివాస్ పేరును క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ సెక్రటరీ అరవింద్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. 'ఎం. శ్రీనివాస్‌ను ఎయిమ్స్, ఢిల్లీ తదుపరి డైరెక్టర్‌గా ప్రతిపాదనను అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏసీసీ) ప్రతిపాదనలను ఆమోదించింది' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. 'ప్రస్తుత ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా 2022 మార్చి 25 నుంచి ఆరు నెలల కాలం, లేదా కొత్త డైరెక్టర్ చేరే వరకు (ఏది ముందు అయితే అది) కొనసాగడానికి ఎక్స్ పోస్ట్ ఫాక్టో ఆమోదించింది'' అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.