Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్నాతకోత్సవం
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో గల వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్న డాక్టర్ జి. సతీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులు బైజూస్ బెంగళూరు వీపీ-హెచ్ఆర్ సుమన్ రుద్రా, కాగ్నిజెంట్ హైదరాబాద్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ కృష్ణ పాకాల, వీఐటీ విశ్వవిద్యాలయ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో క్లాస్ ఆఫ్ 2022కు చెందిన 887 మంది పట్టభద్రులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు. పది మంది బంగారు పతకాలను, 66 మంది ర్యాంకులను సాధించారు. ఈ కార్యక్రమంలో సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. స్నాత కోత్సవంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థులు జీవితంలో విజయం సాధించేందుకు పెద్దగా ఆలోచించాల న్నారు. విద్యా ర్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని సుమన్ రుద్రా సూచించారు. విద్యార్థులు ఉన్నతమైన మానవతా విలువలు కలిగి ఉండాలని కృష్ణ పాకాల చెప్పారు. విద్యార్థులకు మౌలిక సదు పాయాలను కల్పించటంలో వీఐటీ విశ్వవిద్యాలయం ఎప్పుడూ రాజీ పడదని జి. విశ్వనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఐటీ వైస్ ప్రెసి డెంట్ శంకర్ విశ్వనాథన్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వీ కోటా రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ చంద్ర ముదిగంటి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.