Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరనేదానిపై సర్వత్రా చర్చ
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీకి సిద్ధమని ప్రకటించినప్పటి నుంచి రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండు వర్గాలు అధిష్టానం వద్ద తమకే ప్రాధన్యతనివ్వాలని కోరుతున్నాయి. చివరికి దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. వాస్తవానికి అశోక్ గెహ్లాట్ సీఎం కుర్చీని ఖాళీ చేస్తే, ఆ స్థానాన్ని సచిన్ పైలట్‌తోనే భర్తీ చేయాల్సి ఉన్నది. కానీ 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ విజయానికి శక్తియుక్తులు వడ్డిన సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి రాక పోవడం తో కలత చెందాడు. అప్పటి నుంచి అసంతృప్తి తో ఉన్న సచిన్ పైలట్ 2020 జులైలో అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు చేశారు. ఇప్పుడు అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయనుండటంతో సీఎం పదవిపై మళ్లీ సచిన్ ఆశ పెట్టుకున్నారు. తొలుత అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతానని అన్నారు. అందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు. అయితే, ఉదరుపూర్ చింతన్ శిబిర్‌లో చేసిన 'ఒకరికి ఒక పదవే ఉండాల'నే తీర్మా నానికే కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది. అందులో భాగంగానే 'భారత్ జోడో' యాత్ర లో భాగంగా కేరళలో ఉన్న రాహుల్ గాంధీ మీడియా తో మాట్లాడుతూ ఆ తీర్మానాన్ని పునరుద్ఘాటించారు. దీంతో గెహ్లాట్ కోరిక నెరవేరటం లేదు. అయితే, గతంలో తనకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన సచిన్‌కు సీఎం పగ్గాలు అందకూడదని కృతనిశ్చయం లో అశోక్ గెహ్లాట్ ఉన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను వేర్వేరుగా కలిసిన అశోక్ గెహ్లాట్.. 'తన విధేయుడిని' నియమించుకు నేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. సచిన్ పైలట్‌ను నిరా కరించాలనీ, సీఎం పగ్గాలు తన అనుయాయు లకే ఇవ్వాలని కొత్త ప్రతి పాదన తెరపైకి తీసుకొచ్చారు. సచిన్ పైలట్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే సీఎంను ఎమ్మెల్యేలే ఎన్ను కోవాలని చర్చను తీసుకొచ్చారు.
అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు ఆయన సీఎం పదవికీ రాజీనామా చేయ కూడదని అనుకుంటు న్నారు. అధ్యక్షుడు అయ్యాక అపారమైన పలుకుబడి ఉంటుం దనీ, ముఖ్యమంత్రి పదవి సచిన్‌కు వెళ్లకుండా అడ్డుకోవచ్చని అశోక్ భావిస్తున్నారని సచిన్ పైలట్ వర్గం భయపడుతోంది.