Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష నేతలు హాజరు
- తొలి ప్రతిపక్షాల సమావేశం
న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా నేడు (ఆదివారం) ఐఎన్ఎల్డీ పార్టీ సమ్మాన్ దివస్ నిర్వహించనున్నది. హర్యానాలోని ఫతేహాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలను హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానించారు. దీంతో హర్యానా వేదికగా 2024 సాధారణ ఎన్నికలకు ముందు తొలిసారిగా ప్రతిపక్షాలన్ని సమావేశం కానున్నాయి. ఈ గౌరవ దినోత్సవ ర్యాలీకి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే, డీఎంకే నేత కనిమొళి, బీజేపీ హర్యానా నేత బీరేంద్ర సింగ్, ఆర్ఎల్పీ నేత హనుమాన్ బెనివాల్ హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రతినిధిని పంపనున్నది. జేడీఎస్ నుంచి కుమారస్వామి కూడా హాజరయ్యే అవకాశమున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం పొందారు. అయితే వారి హాజరుపై స్పష్టత రాలేదు.