Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీకి మూడు అవార్డులు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేత
న్యూఢిల్లీ : 2020-2021 సంవత్సరానికి జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. శనివారంనాడిక్కడ రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 3 వేర్వేరు విభాగాలలో జాతీయ సేవా పథకం అవార్డులను అందించారు. తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్(ఏపీ)కు 3 అవార్డులు లభించాయి. విద్యాసంస్థల కేటగిరీలో తెలంగాణ నుంచి కాకతీయ యూనివర్శిటీ (కేయూ) ద్వితీయ స్థానం సాధించగా, రాష్ట్రపతి చేతుల మీదుగా సుంకరి జ్యోతి, వాలంటీర్ కేటగిరీలో శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్‌కు చెందిన కూచూరు మైసూరా రెడ్డి అవార్డును అందుకున్నారు. ఏపీ నుంచి ప్రోగ్రాం ఆఫీసర్ కేటగిరీలో జేఎన్టీయూ అనంతపురానికి చెందిన జితేంద్ర గౌడ్, వాలంటీర్ కేటగిరీలో నెల్లూరుకు చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన సిరి దేవనపల్లి అవార్డును అందుకున్నారు.