Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వీస్ రూల్స్ సవరణ : కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం కనీస అర్హత సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం సవరించనుంది. ఏడో సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ) పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్‌కు అనుగుణంగా ఉద్యోగుల పదోన్నతుల కోసం కనీస అర్హత సర్వీసు అవసరాల నిబంధనలను సవరించాలని కేంద్రం నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆఫీస్ మెమోరాండం (ఓఎం)తో ఈ విషయాన్ని ప్రకటించింది. ''సవరించిన నిబంధనలను రిక్రూట్మెంట్ నియమాలు, సర్వీస్ రూల్స్, సరైన సవరణలు చేయడంతో చేర్చవచ్చు. అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు రిక్రూట్మెంట్ నియమాలు, సర్వీసు రూల్స్‌కు తగిన విధానాన్ని అనుసరించిన తర్వాత అవసరమైన సవరణలను అమలు చేయాలని సూచించాం'' అని డీఓపీటీ తెలిపింది.