Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిన్‌పింగ్ గృహనిర్బంధం ఓ కట్టుకథ
న్యూఢిల్లీ: చైనాలో ఏదో జరిగిపోతోంది? అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను అధికారం నుంచి తొలగించి, సైన్యం గృహ నిర్బంధంలో ఉంచిందంటూ ట్విట్ట్లర్ వేదికగా శనివారం పుకార్లు షికార్లు చేశాయి. అవి వట్టి పుకార్లేనని, అందులో ఎలాంటి నిజం లేదని అంతర్జాతీయ విశ్లేషకులు ఆదివారం కొట్టిపారేశారు.. భారతీయ భద్రతా విశ్లేషకులు నితిన్ గోఖలే, రచయిత లారీ గారెట్ జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచారన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. 'చైనాలో తిరుగుబాటు' హ్యాష్ ట్యాగ్‌తో చైనా నుంచి అమెరికాకు పారిపోయిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు జావ్ లాంచియన్ మొదట ఈ పుకార్లను వ్యాపింపజేశారు. బీజింగ్ విమానాశ్రయంలో పదివేల విమానాలు రద్దయ్యాయని, కారణం బీజింగ్‌లో తిరుగుబాటు చోటుచేసుకుందని ప్రచారం చేశారు. ఆ వెంటనే అమెరికాలో మకాం పెట్టిన చైనా 'మానవ హక్కుల కార్యకర్త' జెన్నిఫర్ జింగ్ బీజింగ్ వైపు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కాన్వారు 80 కి.మీ పొడవునా వస్తున్న వీడియోను ఒక దానిని పోస్టు చేశారు. ఆమె ఈ వీడియోతోబాటు పెట్టిన పోస్టింగ్‌లో సమర్కండ్లో షాంఘై కూటమి సమావేశం నుంచి తిరిగి వచ్చిన జిన్‌పింగ్‌ను పిఎల్ఎ చైర్మన్ పదవి నుంచి తొలగించి, గృహ నిర్బంధంలో ఉంచారంటూ వ్యాఖ్యానించి ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోశారు.. 1989లో తియాన్మెన్ స్క్వేర్ ఘటనలప్పుడూ చైనాకు వ్యతిరేకంగా పెద్దయెత్తున తప్పుడు ప్రచారం సాగించారు. చైనా అసమ్మతివాదులకు అమెరికా ఆశ్రయం కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి వారిని ఆయుధాలుగా ఉపయోగించుకుంటుంది. మూడవ వ్యక్తి చైనా పబ్లిక్ సెక్యూరిటీ మాజీ మంత్రి సున్ లిజున్. ఈయన స్టాక్స్‌ను మానిటరింగ్ చేయడం ద్వారా 91 మిలియన్ డాలర్లు ( 646 మిలియన్ల యువాన్లు) అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో చైనా కోర్టు మరణశిక్ష విధించింది. తాజాగా చైనా మాజీ న్యాయ శాఖ మంత్రి పూజెంగ్వా, సీనియర్ అధికారి వాంగ్‌లకు అవినీతి కేసులో చైనా కోర్టు గురువారం మరణ శిక్ష విధించింది. అంతకుముందు పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి సున్ లిజున్, పిఎల్ఎ మాజీ జనరల్, సెంట్రల్ మిలిటరీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ సుకాయిహూలకు కోర్టు ఇదే విధమైన శిక్షలు విధించింది. వీటిని ఉదహరిస్తూ, చైనా కమ్యూనిస్టు పార్టీలో ఏదో జరిగిపోతోందన్న భావన సృష్టించే యత్నం చేస్తున్నారు. ఈ వదంతుల వ్యాప్తిలో అనతి హస్తం కూడా ఉంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వీడియోలను ఆధారం చేసుకుని నిప్పు లేనిదే పొగ రాదు కదా, చైనా ప్రభుత్వం కానీ, చైనా మీడియా కానీ ఇంతవరకు వీటిని ఖండించలేదు కదా, అంటూ ముక్తాయింపునిచ్చాయి. అయిదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతిష్టాత్మక మహాసభ అక్టోబరు 16 నుంచి జరగనున్న తరుణంలో ఈ పుకార్లను ప్రచారం చేయడం గమనార్హం.