Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలట్‌కు వ్యతిరేకంగా 70 మంది ఎమ్మెల్యేల రాజీనామా
జైపూర్ : రాజస్థాన్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం కుర్చీపై అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య పోటీ వాతావరణ నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్ మద్దతుదారులు స్పీకర్ ఇంటికి చేరుకున్నారు. ఇటు సీఎంకు, సచిన్‌కు హైకమాండ్ కబురు పంపింది. దీంతో రాజస్థాన్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఎంపిక చేసింది. అయితే పైలట్ పేరుపై గెహ్లాట్ శిబిరం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. శాసనసభా పక్ష సమావేశానికి ముందే గెహ్లాట్ వర్గానికి చెందిన 70 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషి ఇంటికి చేరుకుని రాజీనామా చేశారు.తమకు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచార్యవాస్ ప్రకటించారు. తిరుగుబాటు చేసిన వ్యక్తులను సీఎం చేయకూడదన్నదే మా డిమాండ్ అని చెప్పారు. ఇటు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, అజరు మాకెన్, మల్లికార్జున్ ఖర్గేలను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది.
గెహ్లాట్, పైలట్లకు హైకమాండ్ సలహా ఇస్తుందని పార్టీ వర్గాల సమాచారం. కేసీ వేణుగోపాల్ వారిద్దరినీ పిలిచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈ సందేశం ఇచ్చినట్టు తెలిసింది. గెహ్లాట్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరికీ రాజీనామా ముసాయిదా అందజేసి, దానిపై వారి పేర్లు రాసి, స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించనున్నారు. అదే సమయంలో సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష సమావేశానికి సీఎం ఇంటికి చేరుకున్నారు.
అంతకుముందు, రాష్ట్ర ఇన్చార్జి అజరు మాకెన్ , పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిసేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హోటల్‌కు చేరుకున్నారు. కొద్దిసేపు భేటీ అనంతరం ముగ్గురూ సీఎం సభకు చేరుకున్నారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు రాకపోవడంతో సమావేశం రద్దయింది. కాంగ్రెస్‌లో సీఎంను మార్చే అంశంపై గెహ్లాట్ అనుకూల ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. మంత్రి శాంతి ధరివాల్ ఇంట్లో జరిగిన సమావేశంలో గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషిని కలిసి రాజీనామాలు సమర్పించేందుకు వ్యూహరచన చేశారు. గెహ్లాట్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు. ఈ సమావేశానికి 70 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభా పక్ష సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హైకమాండ్ ఏది నిర్ణయించినా, మేము దానిని అంగీకరిస్తామని ఒక లైన్ తీర్మానం చేస్తామన్నారు. నేను సీఎం పదవిని వదులుకో వడం ఇష్టం లేదనీ, రిపీట్ అయ్యే ప్రభుత్వాన్ని మాత్రమే సీఎం చేయాలని ఆగస్టు 9న హైకమాండ్‌కి చెప్పానని ఈ మీడియా ప్రచారం చేసిందని తెలిపారు. శాంతి ధరివాల్ ఇంట్లో జరిగిన గెహ్లాట్ అనుకూల ఎమ్మెల్యేల సమావేశానికి మంత్రి రాజేంద్ర గూడా దూరంగా ఉన్నారు. గూడా ధరివాల్ బంగ్లా గేటు నుంచి తిరిగి వచ్చాడు. మెజారిటీకి 101 మంది ఎమ్మెల్యేలు అవసరమనీ, ఇది లేకుండా ప్రభుత్వం మైనారిటీలో ఉంటుందని గూడా అన్నారు.