Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్ల తర్వాత సమావేశం
న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని దేశ రాజధాని ఢిల్లీలో కలిశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజే పీని ఎదుర్కో వటానికి మొత్తం ప్రతిపక్షాలను ఐక్యం చేయాలనే లక్ష్యంగా వీరు సమావేశమయ్యారు. అయితే, ఐదేండ్ల తర్వాత ఈ మూడు పార్టీల నేతలు సమావేశం కావటం గమనార్హం. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) వ్యవస్థాపకులు దివంగత ఛౌధరీ దేవీ లాల్ జయంతి సందర్భంగా ఐఎన్ఎల్డీ నాయకుడు ఓపీ చౌతలా ఫతేబాద్‌లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఆ ఇద్దరు బీహార్ నేతలు ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా సోనియాను కలిశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయననూ కలుస్తానని లాలూ చెప్పారు. గతంలో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో నితీశ్ కుమార్.. రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకులు ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారామ్ ఏచూరీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లను కలిశారు.