Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ యుయు లలిత్
న్యూఢిల్లీ: చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ను అక్టోబర్ 18న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం విచారించనున్నది. మీడియా ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను సోమవారం సీజేఐ జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనంలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా సీజేఐ అక్టోబర్ 18న ఈ అంశాన్ని జాబితా చేస్తామని పేర్కొన్నారు.