Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్కిస్ బానోకు మద్దతుగా ప్రదర్శనకు పిలుపునిచ్చారని
గాంధీనగర్ : సామాజిక కార్యకర్త సందీప్ పాండే, మరో ముగ్గురు కార్యకర్తలను గుజరాత్ పోలీసులు నిర్బంధించారు. 'బిల్కిస్ బానోకి క్షమాపణలు' పేరుతో సోమవారం నుంచి ప్రదర్శనలు చేపట్టాలని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్ పాండే పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో సందీప్ పాండే, మరో ముగ్గురిని గోద్రాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ వారు నిర్బంధంలోనే ఉన్నట్లు బి-డివిజన్ పోలీస్స్టేషన్ అధికారి తెలిపారు. హిందూ ముస్లిం ఏక్తా సమితి ఆధ్వర్యాన సోమవారం నుంచి బానో స్వగ్రామమైన రాంధిక్పూర్ నుంచి ఈ ప్రదర్శన చేపట్టాలని, అక్టోబర్ 4న అహ్మదాబాద్లో ముగించాలని సందీప్పాండే నిర్ణయించారు. పోలీసుల చర్యను ఖండిస్తూ హిందూ - ముస్లిం ఏక్తా కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.