Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీకెంత ధైర్యం రా...
- మధ్యప్రదేశ్లో దళిత యువకుడిపై దాడి
న్యూఢిల్లీ : ''నీకెంత ధైర్యం రా? మా ముందే కుర్చీలో కూర్చుంటావా? ఇక్కడ కూర్చొనే హక్కు మాదే'' అంటూ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఒక దళిత యువకుడ్ని ఇష్టమున్నట్టు కొట్టారు. మరుసటి రోజు బాధితుడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టి..చంపేస్తామని కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. తీవ్రగాయాలతో ఆ దళిత యువకుడు హాస్పిటల్ పాలవగా, అతడి భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని వేడుకుంది. అయితే పోలీస్ స్టేషన్లో ఆమె గోడు పట్టించుకునే నాథుడే లేడు. రెండు రోజులక్రితం మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుందీ ఘటన. కాలం మారినా..కఠినమైన చట్టాలు వచ్చినా..దళితులపై దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. మధ్యప్రదేశ్లో నిత్యం ఏదో ఒక చోట అణగారిన వర్గాలపై దాడులు సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వ యంత్రాంగం వైఖరి వల్లే పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.