Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి-20 దేశాల్లో అథమ స్థానం
న్యూఢిల్లీ : ఒక దేశంలో మహిళల వద్ద ఉన్న సంపద, ఆర్థిక సాధికారత ఆధారంగా వారు ఎంత ముందున్నరో చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సాధి కారత, అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యా సం ఆ దేశ పరపతి, స్థాయిని తెలుపుతుంది. కాగా.. భారత్లో 77 శాతం మంది పురుషులు బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండగా.. మహిళలు 55 శాతం మంది మాత్రమే ఖాతాలు కలిగి ఉన్నారు. అందులోనూ జన్ ధన్ యోజన ఖాతాలే ఎక్కువ. జి-20 దేశాల ఆర్థిక సాధికారతలో లింగ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ టాప్లో ఉండ టం గమనార్హం. క్రెడిట్, డెబిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులు వినియోగంలో జి-20 దేశాల్లో అట్టడు గున ఉందని ఓ రిపోర్టు తెలిపింది. భార త్లో ప్రతీ ముగ్గురులో ఒక్కరి కంటే తక్కువ మంది మహిళలు మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అర్జెం టినా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మెక్సికో, టర్కీ లాంటి దేశాలతోనూ పోల్చినా భారత మహిళలు చాలా వెనుకబడి ఉండటం గమనార్హం. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంలోనూ భారత మహిళ లు చాలా వెనుకబడి ఉన్నారు. బ్యాంక్ ఖాతాలను కలిగిన వారిలో నూ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్నాటకలతో పోల్చితే గుజరాత్ అట్టడుగున ఉంది.