Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను పున్ణ విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలుసవాల్ చేస్తూ మదన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు జూన్ 15న మౌఖికంగా మాత్రమే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడం వల్ల విచారణ, వాదనలు వినడం వథా అని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని పార్టీలు ఆదేశించలేమని స్పష్టం చేసింది. సున్నితమైన ఎన్నికల పిటిషన్ల విషయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 116 ఏ కింద అప్పీలు చేసుకోవడాన్ని నిరోధించలేమని తెలిపింది. కేసులోని అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పున్ణ విచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబరు 10న అన్ని పార్టీలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన బీబీ పాటిల్ తన అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందపరచలేదని, అనర్హత వేటు వేయాలని మదన్మోహన్రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.