Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో రాజా సింగ్ క్రిమినల్ కేసులు పొందుపరచలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సీజేఐ జస్టిస్ యు.యు లలిత్, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాజాసింగ్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ వాటిని అఫిడవిట్లో పేర్కొనలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అనంతరం రాజాసింగ్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం నవంబరు 1లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.