Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శానిటరీ పాడ్స్ అడిగిన విద్యార్థులపై ఐఎఎస్ నోటి దురుసు
పాట్నా : ''రూ.20 లేదా 30కే శానిటరీ పాడ్స్‌ను ప్రభుత్వం ఇవ్వగలదా ? అని బీహార్‌లోని ఒక పాఠశాల విద్యార్ధిని ప్రశ్నించిన పాపానికి ఐఎఎస్ అధికారిణి తన నోటి దూలను ప్రదర్శించింది. ఒక విద్యార్ధి, ఒక ప్రశ్నతోనే ఇది ఆగలేదు. వరుసగా పిల్లలు అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానాలు నివ్వెరపోయేలానే వున్నాయి '' రేపటి రోజున ప్రభుత్వం జీన్స్ ఇవ్వొచ్చు కదా అని మీరు అడుగుతారు. ఆ తర్వాత మంచి చెప్పులు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నిస్తారు. ఇక ఆపై మీకు కుటుంబ నియంత్రణా పద్ధతులు, చివరకు కండోమ్స్ కూడా ప్రభుత్వమే ఇవ్వాలని మీరు భావిస్తారు.'' అంటూ బీహార్ మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అధికారి హర్జోత్ కౌర్ బమ్రా వ్యంగంగా వ్యాఖ్యానించారు. ప్రజలేసిన ఓట్లతోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తించాలంటూ ఆ బాలిక పేర్కొంది. దానికి ఆమె స్పందిస్తూ, ''ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఓటు వేయకండి, అప్పుడు పాకిస్తాన్‌గా మారుతుంది. డబ్బుకు, సేవలకు మీరు ఓటు వేస్తారా ? అని బమ్రా ప్రశ్నించారు. పాకిస్తాన్‌గా మారుతుంది అన్న వ్యాఖ్యకు ఆ బాలిక ధీటుగా స్పందించింది. నేను భారతీయురాలిని, నేనెందుకు మారతాను? అని ఎదురు ప్రశ్నించింది. ''బాలికల సాధికారత, సంపద్వంతమైన బీహార్'' అనే అంశంపై జరిగిన వర్క్‌షాప్ వేదికపై మురికివాడల నుండి వచ్చిన విద్యార్ధినితో కార్పొరేషన్ ఛైర్పర్సన్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా అయిన బమ్రా మాట్లాడిన తీరిది.