Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన శ్రీ భ్రమర టౌన్ షిప్స్ ప్రయివేటు లిమిటెడ్.. ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కనిగిరి పట్టణంలో 'శ్రీ భ్రమర బృందావన్' ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గురువారం ఈ ప్రాజెక్టు ప్రీ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్ ఆవిష్కరించారు. అలాగే, విశిష్ట అతిథులుగా మునిసిపల్ చైర్మెన్ షేక్ అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీ సభ్యులు రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, పారిశ్రామికవేత్త శ్రీ దేవకి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే, శ్రీ భ్రమర హౌసింగ్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గళ్లా రామచంద్ర రావు, సంస్థ డైరెక్టర్లు, భ్రమర బృందం పాల్గొన్నారు.