Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
- మాది స్నేహపూర్వక పోటీ:శశిథరూర్
- రేసులో లేను... : అశోక్ గెహ్లాట్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు నేడు (సెప్టెంబర్ 30) ఆఖరు తేది కావడంతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజరు సింగ్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీపడతారా? లేక ముగ్గురా? అని అడిగిన ప్రశ్నకు అక్టోబర్ 4న నామినేషన్ల ఉపసంహరణ వరకూ వేచి ఉండాలని దిగ్విజరు బదులిచ్చారు. దిగ్విజరు సింగే కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఇప్పటికే నామినేషన్ పత్రాలు స్వీకరించిన ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, జి 23 సభ్యుడు శశిథరూర్ కూడా నేడు నామినేషన్ దాఖలు చేస్తారు. తమది 'స్నేహపూర్వక పోటీ తప్ప ప్రత్యర్థుల మధ్య పోరు కాదు' అని దిగ్విజరు సింగ్ తనను కలిసిన తరువాత శశి థరూర్ అన్నారు. తమ ఇద్దరికీ కాంగ్రెస్ గెలుపే కావాలని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్, శశి థరూర్‌ను గురువారం కలిశారు. మరోవైపు శుక్రవారం నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో చర్చలు ఊపందుకున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జోధ్‌పూర్ హౌస్‌లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌తో సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. సీనియర్ నేత ఎకె ఆంటోని కేరళ హౌస్‌లో తారిక్ అన్వర్‌ను కలిశారని తెలిసింది. అలాగే ఎకె ఆంటోనిని కెసి వేణుగోపాల్ కలిశారు. దిగ్విజరు సింగ్‌ను పి.చిదంబరం కలిశారు.
సిఎంగా కొనసాగాలా? వద్దా? అనేది సోనియా నిర్ణయిస్తారు : గెహ్లాట్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ వర్గం తిరుగుబాటుతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనను పోటీ నుంచి తప్పించారు. బుధవారం సాయంత్రం నుంచి పడిగాపులు కాసిన గెహ్లాట్‌కు ఎట్టకేలకూ గురువారం అపాయింట్మెంట్ ఇచ్చిన సోనియా గాంధీ ఆయన గట్టిగా మందలించారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో కలిసి ఆయన సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీలో సోనియా అన్ని విషయాలపై నిలదీశారు. ఇటీవల రాజస్థాన్‌లో గెహ్లాట్ వర్గీయులు తీరు, తాను ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంపై సోనియా మండిపడ్డారు.