Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2019ను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ 2021పై విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి ఈ సమాచారాన్ని అందించారు. వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2019ని కేంద్రం ఈ ఏడాది గతనెల 3న ఉపసంహరించుకున్న విషయం విదితమే. ఆ సమయంలో పార్లమెంటు జాయింట్ కమిటీ.. బిల్లులో 81 మార్పులు, '12 మేజర్ సిఫారసుల'ను చేసింది. దీంతో కేంద్ర ఆ సమయంలో బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ బిల్లును 2019 డిసెంబర్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ప్రజల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించటంపై ఆంక్షలు విధించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలు ఉంటాయి.