Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబాల బడ్జెట్ తారుమారు
- నిత్యావసరాల ధరల దెబ్బ
- గ్రామీణ కొనుగోళ్లు పతనం
న్యూఢిల్లీ : అధిక ధరల దెబ్బకు దేశ ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతుంది. దీంతో కుటుంబాల బడ్జెట్ తారు మారు అవుతోంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల మార్కెట్లలో కొనుగోళ్లు పడిపోతున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ''హెచ్చు ద్రవ్యోల్బణంతో గ్రామీణ ప్రాంత ప్రజలు కొనుగోళ్లు తగ్గించేశారు. బిస్కెట్లు, చాక్లెట్లు, వ్యక్తిగత శుభ్రత ఉత్పత్తులను సైతం కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు'' అని పరిశోధన సంస్థ కంటర్, గ్రూప్ఎంఎస్ డైలాగ్ ఫ్యాక్టరీ తన రూరల్ బారోమీటర్ రిపోర్ట్‌లో తెలిపింది. గ్రామీణ ప్రాంత అమ్మకాల్లో 5 శాతం తగ్గుదల చోటు చేసుకున్నదని ఇందులో వెల్లడించింది.డిసెంబర్ 2021 నుంచి జులై 2022 మధ్య అన్ని ఉత్పత్తుల అమ్మకాలపై ఈ రిపోర్టును రూపొందించింది. 18-55 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వినియోగదారులను ఇందులో భాగస్వామ్యం చేసింది. ఆ రిపోర్ట్ వివరాలు.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సాధారణంగా చిన్న ప్యాక్‌లు లేదా తక్కువ బ్రాండ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. సర్వేల్లో పాల్గొన్న వారిలో 70 శాతం మంది తమను అధిక ధరలు వేదిస్తున్నాయన్నారు. హెచ్చు ధరలు తమ ఆర్థిక పరిస్థితులను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని నైపుణ్యం, నైపుణ్యేతర కార్మికులు, చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆర్థిక పరిస్థితిపై వ్యవసాయదారులు తక్కువ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. దేశ ఆర్థిక పటిష్టంపై నమ్మకం లేదని పేర్కొన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. నిల్సన్ ఐక్యూ నివేదిక ప్రకారం.. జూన్ త్రైమాసికంలో గ్రామీణ ప్రాంతాల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల్లో 2.4 శాతం తగ్గుదల నమోదయ్యిందని కాంతర్ ఇటీవల ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. గ్రామీణ వినియోగదారులు ఖర్చును తగ్గించుకోవడానికి చిన్న ప్యాక్‌లకు మారుతున్నారని చెప్పారు. పట్టణ మార్కెట్ల కంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ విప్రో కన్స్యూమర్ అంగీకరించింది. సెప్టెంబరు త్రైమాసికంలో ద్రవ్యోల్బణం కొంత స్తబ్దుగా ఉండటంతో.. డిమాండ్ స్వల్పంగా మెరుగుపడినప్పటికీ ప్రజల్లో విశ్వాసాన్ని నింపలేకపోయింది. ఉత్తర భారతదేశం సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రజలకు భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ విశ్వాసం ఉందని, కర్ణాటక మినహా దక్షిణాదిలో కర్నాటక మినహా మిగితా రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థపై కొంత విశ్వాసాన్ని వ్యక్తం చేశాయని గ్రామీణ బేరోమీటర్ నివేదిక పేర్కొంది. గ్రామీణ మార్కెట్లలో ద్రవ్యోల్బణం ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని, 2022 ప్రథమార్థంలో వినియోగదారుల విశ్వాసం క్షీణించడంలో దీని ప్రభావం కనిపించిందని ఆసియా-పసిఫిక్, డైలాగ్ ఫ్యాక్టరీ ఎక్స్‌పీరియన్షియల్ మార్కెటింగ్ హెడ్ దల్వీర్ సింగ్ అన్నారు. ''కాగా.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి, అయితే ఉత్తర భారతదే శం, పశ్చిమ బెంగాల్ అంత ఆశాజనకంగా లేవు. గత ఆరు నెలల్లో పెద్ద టిక్కెట్ల వ్యయం స్తబ్దుగా ఉంది లేదా తగ్గుతోంది. దీనికి విరుద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు మాత్రం నిరంతరంగా పెరగడంతో వ్యయాల్లో వృద్ధి చోటు చేసుకుంటుంది.''అని దిల్విర్ సింగ్ పేర్కొన్నారు.