Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుదుచ్చెరి విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి అభినందనలు : సీఐటీయూ
న్యూఢిల్లీ : విద్యుత్ పంపిణీ, రిటైల్ విక్రయాలను ప్రయివేటీకరిస్తూ మోడీ సర్కార్ చేపడుతున్న చర్యల్ని 'సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్' (సీఐటీయూ) తీవ్రంగా ఖండించింది. విద్యుత్ ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేసింది. ప్రయివేటీకరణను నిరసిస్తూ పుదుచ్చెరిలో సెప్టెంబర్ 28న విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది చేపట్టిన సమ్మె విజయవంతమైందని, వారి పోరాటానికి సీఐటీయూ అభినందనలు తెలియజేసింది. అన్ని కార్మిక సంఘాలతో కూడిన పుదుచ్చెరి విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సమ్మెకు నాయకత్వం వహించింది. సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పోరాటానికి మద్దతుగా ప్రజలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు వీధుల్లోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
విద్యుత్ పంపిణీ, ఇతర సేవలన్నింటినీ ప్రయివేటీకరించాలని మోడీ సర్కార్ గత కొన్నేండ్లుగా ప్రయత్నిస్తోంది. తొలుత జమ్మూ కాశ్మీర్లో అమల్లోకి తేవాలనుకుంది. అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదురు కావటంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. చండీగఢ్‌లో మొత్తం విద్యుత్ శాఖనే కార్పొరేట్‌కు అప్పగించాలని కేంద్రం ప్రణాళిక ప్రకటిం చింది. అన్ని వర్గాల ప్రజలు ఎదురు తిరగటంతో ఆ ప్రయత్నాన్ని నిలిపి వేసింది. ఈ అనుభవాల్ని పట్టించుకోకుండా ఈఏడాది సెప్టెంబర్ 27న పుదుచ్చెరిలో విద్యుత్ పంపిణీ, రిటైల్ విక్రయాలను 100శాతం ప్రయి వేటీకరిస్తూ కేంద్రం ప్రణాళికను ప్రకటించింది. దీనిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది అంతా నిరవధిక సమ్మెకు దిగారు. వీరి పోరాటానికి అండగా నిలవాలని, ప్రత్యేకించి కార్మిక వర్గానికి, వాటి అనుబంధ సంఘాలకు సీఐటీయూ పిలుపు నిచ్చింది.