Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంత పురం : కేరళలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదేండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుండగునికి ఏకంగా 142 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా వేసింది. ఆ జరిమానా కట్టలేకపోతే అదనంగా మరో మూడేండ్ల పాటు జైలు శిక్ష అమలయ్యేలా న్యాయస్థానం తీర్పు నిచ్చింది. కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. తిరువల్లలో నివసించే ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు (41) ఓ పదేండ్ల బాలికపై రెండేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2019-21 కాలంలో పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. బాలిక బంధువైన బాబు.. వారి ఇంట్లోనే ఉంటూ మంచివాడిలా నటిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ బాలిక తనపై జరుగుతున్న దారుణాన్ని ఇంట్లో చెప్పలేకపోయింది. కానీ చివరకు విషయం బయటపడటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని పతనంతిట్ట కోర్టులో ప్రవేశపెట్టగా.. తాజాగా కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.