Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అందజేసిన రాష్ట్రపతి
- సౌత్ జోన్లో ఎక్కువ అవార్డులు తెలంగాణకే
న్యూఢిల్లీ : స్వచ్ఛ సర్వేక్షణ్.. లక్ష జనాభా పైబడిన నగరాల్లో హైదరాబాద్ (5613 స్కోర్) 26వ ర్యాంక్ సాధించింది. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అందజేశారు. లక్ష జనాభా పైబడిన నగరాల్లో సిద్ధిపేట (5540 స్కోర్) 30వ ర్యాంక్, వరంగల్ (4677 స్కోర్) 84వ ర్యాంక్, కరీంనగర్ (4563 స్కోర్) 89వ ర్యాంకుల్లో నిలిచాయి. లక్ష జనాభాకు తక్కువగా వున్న నగరాల్లో బడంగ్‌పేట (5122 స్కోర్)కు 86వ ర్యాంక్ వచ్చింది. కంటోన్మెంట్ బోర్డుల్లో సికింద్రాబాద్ (4114 స్కోర్) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. 50 వేల నుంచి లక్ష జనాభా గల సౌత్ జోన్ నగరాల్లో పరిశుభ్ర నగరంగా బడంగ్‌పేట, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా కోరుట్ల, స్వయం సమృద్ధి నగరంగా సిరిసిల్ల నిలిచాయి. 25 వేల నుంచి 50 జనాభా ఉన్న నగరాల్లో పరిశుభ్ర నగరంగా గజ్వేల్, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా తుర్కయంజల్, పౌర ప్రతిస్పందన అవార్డును వేములవాడ సొంత చేసుకున్నాయి. 15 వేల నుంచి 25 వేల మధ్య జనాభా కలిగిన నగరాల్లో పరిశుభ్ర నగరంగా ఘట్కేసర్, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా కొంపల్లి నిలిచాయి. పౌర ప్రతిస్పందన అవార్డును హుస్నాబాద్, ఆవిష్కరణలు, స్వయం సమృద్ధి నగరంగా ఆదిబట్ల నిలిచింది. 15 వేల జనాభాకు తక్కువ ఉన్న నగరాల్లో పరిశుభ్ర నగరంగా కొత్తపల్లి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా చండూర్, పౌర ప్రతిస్పందన అవార్డును నేరేడుచర్ల, ఆవిష్కరణలు, ఉత్తమ పద్దతుల అవార్డను చిట్యాల్, స్వయం సమద్ధి నగరాల్లో భూత్పూర్ నిలిచాయి.