Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : ఉత్తరప్రదేశ్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్లో ట్రాక్టర్ బోల్తా పడి 22 మంది చనిపోయారు. వీరిలో 11 మంది చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫతేపూర్ నుంచి ఘాటమ్పూర్కు యాత్రికులు వెళుతున్నారు. చంద్రికా దేవి ఆలయంలో జరిగే ముందాన్ వేడుక కోసం వారంతా వెళుతున్నారు. ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. చనిపోయిన వారికి సంతాపం తెలిపింది. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందజేస్తామని మోడీ ప్రకటించారు.