Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికం
- జాతీయ సగటును మించిన నేరాల శాతం
- దళిత సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దళితులకు సామాజికంగా భద్రత కరువైంది. వారు తీవ్ర వేధింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు అధికంగా ఉన్నాయి. దీంతో కేంద్రం, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ పాలిత ప్రభుత్వాల నిర్లక్ష్య తీరుపై దళిత సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా.. అక్కడ దళితులకు రక్షణ కరువైందని వాపోయారు. ఆయా రాష్ట్రాల్లో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్ ఉత్సవాల పేరిట కేంద్రం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపింది. అయితే ఈ 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సామాజిక అంతరాలు ఏ మాత్రమూ దూరం కాలేదని విశ్లేషకులు చెప్పారు.
రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో మూడో తరగతి చదువుతున్న దళిత బాలుడు.. నీటి కుండను తాకినందుకు ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సదురు విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం విదితమే. యూపీలోని ఔరియా జిల్లాలో 15 ఏండ్ల బాలుడు తన పరీక్షలో తప్పు చేసినందుకు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. దీంతో ఈ విద్యార్థి కూడా ప్రాణాలను కోల్పోయాడు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఒక గ్రామానికి చెందిన ఇద్దరు దళిత సోదరీమణులు లైంగికదాడికి, హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలు చెట్టుకు వేలాడదీయబడ్డాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలు భారత్‌లో దళితులు అనుభవిస్తున్న హింస, అణచివేతలో ఒక భాగం. 1991 నుంచి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అధికారికంగా ఏడు లక్షలకు పైగా దారుణాలు నమోదయ్యాయి. అంటే ప్రతి గంటకు ఐదు ఘటనలు అన్నమాట. అయితే, చాలా వరకు కేసుల్లో నిందితులు పెత్తందారీ కులాలకు చెందినవారు కావటంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదని విశ్లేషకులు వివరించారు.
కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న హింస
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పట్ల దారుణాలు తీవ్రమయ్యాయి. గత మూడేండ్లలో అంటే 2019 నుంచి 2021 వరకు దేశంలో దళితులపై అఘాయిత్యాలు 11 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమాచారం ప్రకారం.. 2019లో 45,961 కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి అవి 50,900కి పెరిగాయి. రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. రాజస్థాన్ (11శాతం), యూపీ( 11 ), కర్నాటక (11), మహారాష్ట్ర (16), తమిళనాడు (20), పంజాబ్ (20), ఒడిశా (23), హిమాచాల్‌ప్రదేశ్ (29), గోవా (33), మధ్యప్రదేశ్ (36), ఉత్తరాఖండ్ (46), హర్యానా( 50శాతం) లలో భారీ మొత్తంలో దళితులపై అఘాయిత్యాలు పెరిగాయి. దాదాపు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సగటు కంటే ఎక్కువ పెరుగుదలను ప్రదర్శించటం గమనించాల్సిన అంశం. బీజేపీతో సహా సంఫ్‌ు పరివార్ అగ్రవర్ణ ఆధారిత భావజాలం ఈ ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పాడ్డాయని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సానుభూతి కారణంగా ఇది తీవ్రతరం కావచ్చని హెచ్చరించారు.