Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత అధిక ఎగుమతి ప్రణాళికలపై దెబ్బ
- మోడీ సర్కారుకు ఆర్థిక నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక మందగమనం ఆయా దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. దీని ప్రభావం భారత పైనా చూపిస్తున్నది. నిర్దేశించిన లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నది. ముఖ్యంగా అధిక ఎగుమతులను పెంచడంపై భారత్ ముఖ్యంగా దృష్టి పెట్టింది. అయితే, ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావంతో భారత అధిక ఎగుమతి ప్రణాళికలపై దెబ్బ పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే కోవిడ్, లాక్డౌన్ వంటి పరిస్థితులను ఎదుర్కొన్ని ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న తరుణంలో ఆర్థిక మందగమనం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తున్నదని మోడీ సర్కారును హెచ్చరించారు.
భారత్‌కు ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు యూఎస్, యూరప్ దేశాలు. అయితే, రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం సదరు దేశాల పరిస్థితులను దిగజార్చాయి. రష్యా దేశంపై ఆంక్షలతో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొం టున్నాయి. కొన్ని దేశాలైతే ఎన్నడూ లేనంతగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ, వేతనాల్లో కోతలు విధిస్తూ పొదుపు చర్యలకు దిగుతుండటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నదని నిపుణులు చెప్పారు. దీంతో భారత్‌కు ఎగుమతి మార్కెట్లు అయిన ఈ దేశాల్లోని పరిస్థితులు సంకటంగా మారాయని వివరించారు. ''విదేశీ వాణిజ్య విధానాన్ని విడుదల చేస్తే సరిపోదు. ప్రభుత్వం వార్షిక ఎగుమతి 2030 నాటికి రూ. 81 లక్షల కోట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకున్నందున, ఎగు మతి దారులను ప్రోత్సహించడానికి నిధుల యంత్రా ంగాన్ని కూడా తీసుకురావాలి'' అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) డైరెక్టర్ జనరల్ అజరు సహారు చెప్పారు. '' ప్రపంచ మందగమనం మనపై ప్రభావం చూపటం ప్రారంభించింది. ఒకటి, అధిక విలువ కలిగిన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గటం ప్రారంభమైంది. రెండు, భారత్ భారీ పరిమాణంలో ఎగుమతి చేసే ముడి పదార్థాలు, మధ్యవర్తుల ధరలు ఇటీవలి నెలల్లో బాగా పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, కరెన్సీ హెచ్చు తగ్గులు, అధిక ఎగుమతి పథకం కోసం భారత్‌ను ప్రభావితం చేస్తాయి. ఇక ఎగుమతులు ఏ మేరకు దెబ్బ తింటాయో అన్నది ప్రశ్న కాదు'' అని వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారత్ 2022 ఆర్థిక సంవత్సరంలో 676 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ అత్యధిక ఎగుమతి సంఖ్యను సాధించింది. ఇది కోవిడ్‌కు ముందు 2020 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 527 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నది. భారత ఎగుమతి దారులు ఈ ఆర్థిక సంవత్సరం అట్టహాసంగా ప్రారంభించారు. గతేడాది ఏప్రిల్ - ఆగస్టు కాలంతో పోలిస్తే ఈ ఏడాది మొత్తం (వస్తువులు, సేవలు) ఎగుమతుల్లో 19.7 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. అయితే, ఎగుమతిదారులు మాత్రం విశ్వాసంతో లేరని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఎగుమతులు క్షీణతతో కూడిన మార్గాన్ని ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు నెలవారీ ఆర్థిక సమీక్ష కూడా ప్రపంచ వృద్ధి, వాణిజ్య దృక్పథం ఎలా బలహీన పడిందో సూచించింది. జపాన్, జర్మనీ, యూకే, ఇటలీ ఉత్పత్తిలో ఇదే విధమైన సంకోచాన్ని ఎదుర్కొ న్నాయని వివరించింది. చైనాకు ఎగుమతులు 36 శాతం తగ్గుదలను చూశాయి. అలాగే, చైనా నుంచి భారత్ దిగుమతులు 29 శాతం పెరగటం గమ నార్హం. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనీ, లేకపోతే దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ఆర్థిక, వాణిజ్య నిపుణులు హెచ్చరించారు.