Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న ఎన్కౌంటర్లు
- తాజా ఘటనల్లో ఇద్దరు మృతి
పుల్వామా : జమ్ము కాశ్మీర్లో భద్రతా బలగాలకు, సాయుధులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. కాశ్మీర్ లోయలో నెత్తుటి తడారని రోజంటూ లేకుండా పోతుంది. తాజాగా ఆదివారం వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో ఒక పోలీసు ఉద్యోగి, మరో ఉగ్రవాది మరణించారు. దక్షిణ కాశ్మీర్ పరిధి పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు ఆదివారం జరిపిన దాడుల్లో ఒక పోలీస్ ఉద్యోగి ఒకరు మరణించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాను తీవ్ర గాయాల పాలయ్యారు. సిఆర్పిఎఫ్, పోలీసుల సంయుక్త బృందంపై పింగ్లనా వద్ద టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ఆదివారం ట్వీట్ చేశారు. అనంతరం పోలీ సులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సోఫియాన్‌లో జరిగిన మరో ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది మరణించాడు. పలు ఉగ్రదాడుల్లో పాల్గొన్న నసీర్ అహ్మద్ భట్‌గా మృతుడిని గుర్తించారు.