Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని డిస్మిస్
- దళితుడైనందు వల్లే టార్గెట్ చేశారు : మిథిలేశ్ కుమార్ గౌతమ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్ అండదండలతో హిందూత్వ గ్రూపులు చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా వర్సిటీల్లో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు, లెక్చరర్లను టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాయి. హిందువుల పండుగ 'దుర్గా నవరాత్రి' గురించి వారణాసి వర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దుమారం రేపాయి. ఏబీవీపీ, బీజేపీ నాయకుల బెదిరిం పులు, ఒత్తిడికి తలొగ్గిన వారణాసి వర్సిటీ పాలకవర్గం, మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మిథిలేశ్ కుమార్ గౌతమ్‌ను ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేసింది. ''ముఖ్యంగా మహిళలకు ఒక సూచన చేయదలుచుకున్నా. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండ టం కన్నా భారత రాజ్యాంగా న్ని, హిందూ కోడ్ బిల్లును చదవాలని వారికి సూచిస్తున్నా''నని సామాజిక మాధ్యమంలో సందేశాన్ని గౌతమ్ పోస్ట్ చేశారు. భయం, బానిసత్వం నుంచి మహిళలు విముక్తి పొందా లని ఆకాంక్షించారు. అయితే దీనిపై ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం 'ఏబీవీపీ' పెద్ద రాద్దాంతం చేసింది. కేవలం ఏబీవీపీ నాయకులు, కార్య కర్తలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న వారణాసి వర్సిటీ, ప్రొఫెసర్ గౌతమ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. వర్సిటీలో పనిచేస్తున్న దళిత ప్రొఫెసర్లు, లెక్చరర్లపై హిందూత్వ శక్తులు దాడులు చేస్తున్నాయని, గతంలోనూ భారత రాజ్యాంగాన్ని బోధించిన దళిత టీచర్లను హిందూత్వ గ్రూపులు టార్గెట్ చేశాయని గౌతమ్ వివరించారు. ''భారత రాజ్యాంగం, హిందూ కోడ్ చదవాలని మహిళలకు సూచిం చటం తప్పా? మహిళా సాధికారతపై మాట్లాడటం నేరమా? కనీసం నా వైపు నుంచి వివరణ కోరకుండా..చర్యలు చేపట్టారు'' అని గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు.