Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా వాళ్లు నాకు మద్దతు ఇచ్చారు:
మీడియాతో మల్లికార్జున్ ఖర్గే
- ఖర్గే వల్ల పార్టీలో మార్పు రాదు: శశిథరూర్
న్యూఢిల్ల్లీ : ''ఇప్పుడు జీ 23 క్యాంప్ లేదు. ఆ నాయకులందరూ ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని కోరుకుంటు న్నారు. అందుకే తనకు మద్దతు ఇస్తు న్నారు'' అని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే అన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన మల్లికార్జున్ ఖర్గే ఆదివారం మహాత్మా గాందీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ప్రచారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏకాభిప్రాయ అభ్యర్థిని కలిగి ఉండటం మంచిదని తన తోటి పోటీదారు శశిథరూర్‌తో చెప్పాననీ, అయితే లోక్‌సభ ఎంపీ ప్రజాస్వామ్యం కోసం పోటీకి పట్టుబట్టారని అన్నారు. తాను ఎవరినీ ఎదిరించేందుకే ఎన్నికల బరిలోకి దిగలేదనీ, పార్టీని బలోపేతం చేయడం కోసమేనని పోటీ చేస్తున్నా నని అన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు పార్టీ అధ్యక్షులు కావాలని కోరుకోవడం లేదనీ, సీనియర్ నాయకులు, యువ నేతలు అందరూ తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని ఖర్గే చెప్పారు. తాను పార్టీ అధ్యక్షుడైతే, గాంధీ కుటుంబాన్ని, ఇతర సీనియర్ నేతలను సంప్రదించి, వారు సూచిం చిన మంచి విషయాలను అమలు చేస్తానని ఖర్గే చెప్పారు. తన వెనుక గాంధీ కుటుంబ ఉన్నదని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారే శారు. గాంధీలు ఎవరికీ మద్దతు ప్రక టించలేదని అన్నారు. ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని పేర్కొ న్నారు. ఒకరికి ఒకే పదవి ఉండాలనే పార్టీ నిబంధనను గౌరవిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి తాను రాజీనామా చేసినట్లు ఖర్గే తెలిపారు. ఎవరూ గెలిచినా పార్టీలో సంస్కరణల కోసం సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సిం దేనని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ధరల పెరిగా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవే ర్చలేకపోయిందని విమర్శించారు. మరోవైపు ఖర్గేకు మద్దతుగా ఆయన కోసం ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవులకు గౌరవ్ వల్లబ్, దీపిందర్ హుడా, నజీర్ హుస్సేన్ రాజీనామా చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగు తున్నాయని చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఖర్గే విజయం కోసం తమవంతు కృషి చేస్తామని అన్నారు.
ఖర్గేతో బహిరంగ చర్చకు సిద్ధం: శశిథరూర్
అభ్యర్థుల మధ్య ముఖాముఖిలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మరో కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్ అన్నారు. ఇది పార్టీ పట్ల ప్రజలకు ఆసక్తిని రేకెత్తిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ, గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉందని, ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన అన్నారు. ఆదివారం మహా రాష్ట్రలోని నాగపూర్‌లో దీక్షాభూమి స్మారకాన్ని సందర్శించిన అనంతరం ఎన్నికల ప్రచారానికి శశిథరూర్ శ్రీకారం చుట్టారు. ''మేము (ఖర్గే-థరూర్) శత్రువులం కాదు. మా మధ్య జరుగుతున్నది యుద్ధం కూడా కాదు. ఇది పార్టీ భవిష్యత్ కోసం జరుగు తున్న ఎన్నికలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ టాప్-3 అగ్రనేతల్లో ఆయన ఒకరు. అయితే ఆయన వంటి నేతలు మార్పు తీసుకురాలేరు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తారు. నేను మాత్రం పార్టీ కార్యకర్తల అంచనాలకు అను గుణంగా మార్పు తీసుకువస్తాను'' అని అన్నారు. గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురినీ (సోనియా, రాహుల్, ప్రియాంక) తాను కలుసుకున్నానని, పార్టీ తరపున అధికారిక అభ్యర్థి ఎవరూ లేరని వారు పదేపదే తనకు చెప్పారని ఆయన తెలిపారు. సుహృ ద్భావ వాతావరణంలో, పారదర్శికంగా ఎన్నికలు జరగాలని మాత్రమే వారు కోరుకున్నారని అన్నారు. గాంధీ కుటుంబం తటస్థంగా ఉంటుందని, పార్టీ యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిన హామీపై తనకు ఎలాంటి అనుమానాలు కూడా లేవని ఆయన తెలిపారు.