Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుగ్రామ్‌లోని మేదాంత ఐసీయూలో చికిత్స
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్టు సమాచా రం. దీంతో ఆయన్ను హర్యానా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని అనా రోగ్య కారణాల రీత్యా ఆగస్టు 22 నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న 82ఏండ్ల ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆదివారం క్షీణించడంతో ఆయన్ను ఐసీయూ వార్డులోకి మార్చినట్టు సమాచారం. ములాయం ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను ఐసీయూకి మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్య నిపుణులు డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియా పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్టు తెలిసింది. ములాయం రొటీన్ చెకప్ కూడా ఇదే ఆస్పత్రిలోనే జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది జులైలో నలతగా ఉండటంతో ఆయన ఇదే ఆస్పత్రిలో చేరి చికిత్సపొందారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందు కున్న ములాయం తనయుడు, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఢిల్లీకి బయల్దేరారు. అలాగే, ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.