Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 300కు పైగా పురస్కారాలు నిలిపివేత
- మోడీ సర్కారు తీరుతో శాస్త్రవేత్తల అసంతృప్తి
భారత్ అంటేనే విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇదంతా మీ చలువేనంటూ పొగిడే ప్రధాని మోడీ..శాస్త్రవేత్తలకు మాత్రం మొండిచేయి చూపారు. ఓ వైపు 'విజ్ఞాన రత్న' అవార్డులిస్తామంటున్న బీజేపీ సర్కార్ ఏకంగా 300 కంటే మించి పలు రంగాలకు సంబంధించిన అవార్డులను నిలిపివేసింది.మోడీ సర్కారు తీరుతో శాస్త్రవేత్తల్లో చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : శాస్త్రవేత్తలకు ఇచ్చే సైన్స్ అవార్డులకు బ్రేక్ పడింది. సైన్స్, అంతరిక్షం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖలకు చెందిన శాస్త్రవేత్తలకు 300 కంటే ఎక్కువ ప్రభుత్వ అవార్డులు ఈ నెలలో నిలిపివేయబడ్డాయి. భవిష్యత్తులో 'విజ్ఞాన రత్న' అనే నోబెల్ బహుమతి లాంటి సైన్స్ అవార్డును ఏర్పాటు చేయాలని హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇది అన్ని విభాగాల శాస్త్రవేత్తలకు సంబంధించినది. హౌం సెక్రెటరీ ఎ.కె అధ్యక్షతన జరిగిన సమావేశం మినిట్స్ ప్రకారం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌తో సంప్రదించి ఇవ్వబడుతుంది. భారతదేశపు అత్యున్నత సైన్స్ అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌ను ప్రకటించటంలో జాప్యం జరిగిన తర్వాత ఈ వెల్లడి రావటం గమనార్హం. మోడీ సర్కారు తీరు శాస్త్రీయ సమాజాన్ని కలవరపర్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అందించే బహుమతిని సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 26న ప్రకటిస్తారు. ఈ బహుమతిని అందజేయటం కొనసాగుతుండగా, అది ఎప్పుడు ప్రకటించబడుతుందనే ప్రస్తావన లేదు. ''నిలిపివేయబడిన'' బహుమతులలో అతిపెద్ద భాగం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి వచ్చింది. ఈ విభాగానికి చెందిన మొత్తం 211 అవార్డులలో 207 అవార్డులు తొలగించబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అలామిక్ ఎనర్జీ మొత్తం 38 అవార్డుల స్థానంలో ''చాలా ఉన్నత స్థాయి'' ఉన్న కొత్త అవార్డు వస్తుంది. అలాగే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అందించే మూడు అంతర్గత అవార్డుల స్థానంలో అంతరిక్ష శాస్త్రానికి ఉన్నత స్థాయి అవార్డును ఏర్పాటు చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టియల్ రీసెర్చ్ నుంచి ఆరు అవార్డులు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ నుంచి మూడు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి 13, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ నుంచి 34 అవార్డులు తొలగించబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ జాతీయ అవార్డులలో ఒకటి డాక్టర్ అన్నామణి మహిళా శాస్త్రవేత్త జాతీయ అవార్డు ఇప్పుడు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే ఇతర విభాగాల అవార్డులతో విలీనం చేయబడుతుంది. మిగిలిన మూడింటి స్థానంలో ఉన్నత స్థాయి జాతీయ అవార్డును ఏర్పాటు చేస్తారు. నర్సింగ్ నిపుణులకు ఇచ్చే గుర్తింపు నేషనల్ ఫోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డు లోనూ మార్పులను ఉండనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం 51 నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందిస్తున్నది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చే 17 అవార్డుల్లో 13 అవార్డులు నిలిచిపోనున్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అందించే మూడు జాతీయ అవార్డులు (బి.సి. రారు అవార్డుతో సహా) ప్రస్తుతానికి నిలిపివేయబడటం గమనార్హం. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఇచ్చే 37 అవార్డులలో ముప్పై నాలుగు నిలిపివేయబడ్డాయి. వీటిలో బయోమెడికల్ పరిశోధనకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చే రెండు అవార్డులు ఉన్నాయి.