Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 3న పోలింగ్
- 6న ఓట్ల లెక్కింపు,ఫలితాలు
- దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాల్లో...
న్యూఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనున్నది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడుతో పాటు ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానున్నది. అక్టోబర్ 14న నామినేషన్ల దాఖలకు గడువు ఉన్నది. అక్టోబర్ 15న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17న గడువు విధించారు.నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనున్నది. తెలంగాణలోని మునుగోడుతో పాటు అంధేరి ఈస్ట్ (మహారాష్ట్ర), మోకమా, గోపాల్‌గంజ్ (బిహార్), అదంపూ ర్ (హర్యానా), గోలగోఖర్నాథ్ (ఉత్తరప్రదేశ్), ధామ్‌నగర్ (ఒడిశా)స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్నది. కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దీంతో మునుగో డులో ఉపఎన్నిక అనివార్యమైంది.