Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 360 కోట్లకు అంచనా.. బిడ్లకు కేంద్రం ఆహ్వానం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కోసం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి ప్రభుత్వం బిడ్దలను ఆహ్వానించింది. నిర్మాణ ఖర్చును రూ.360 కోట్లు అంచనా వేసింది. అక్టోబర్ 1న సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) ప్రీ క్వాలిఫికేషన్ బిడ్ల ఆహ్వానించింది. ఇది అక్టోబర్ 14 వరకు కొనసాగుతోంది. ఆ తరువాత క్వాలిఫైయింగ్ బిడ్డర్లు తమ ఆర్థిక బిడ్లను సమర్పించవలసి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి 21 నెలలు పడుతుందని అంచనా వేసింది. సెంట్రల్ విస్టా రీ డెవలప్మెంట్ ప్లాన్‌లో భాగంగా టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సీపీడబ్ల్యూడీ నిర్మాణ సంస్థల నుంచి బిడ్లను కోరింది.
ప్రధానమంత్రి నివాస సముదాయం రాష్ట్రపతి భవన్, సౌత్ బ్లాక్‌కి ఆనుకొని డీఆర్డీఓ భవనానికి ఎదురుగా దారాషికో రోడ్లో ఏ, బీ బ్లాక్‌ల్లో ఉంటుందని సీపీడబ్ల్యూడీ పేర్కొంది. ''నిర్మాణ సైట్ అత్యంత సురక్షితమైన జోన్లో ఉంది. ప్రతిపాదిత భవనాలు రీన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ బిల్డింగ్‌గా ఉండాలి. ఏ, బీ బ్లాక్‌లలో ఉన్న నిర్మాణాలను కొత్త నిర్మాణాన్ని ప్రారంభించే ముందు కూల్చివేయాల్సి ఉంటుంది'' అని సీపీడబ్ల్యూడీ పేర్కొంది. ఈ కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి నివాసం, ప్రధాని హౌమ్ ఆఫీస్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆఫీస్, సేవా సదన్, గెస్ట్ హౌస్, బేస్మెంట్ పార్కింగ్ ఉంటాయి. దాదాపు 21,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుందని తెలిపింది. మురుగునీటి శుద్ధి కర్మాగారం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, 25 వాచ్టవర్లు, భద్రతా వ్యవస్థలతో కూడిన నాలుగు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఉంటాయి. సీపీడబ్ల్యూడీ జులై 18న రూ.360 కోట్ల ప్రాజెక్ట్ కోసం ప్రీ క్వాలిఫికేషన్ టెండర్‌ను విడుదల చేసింది. కానీ ఆ రోజు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం ''పరిపాలన కారణాలను'' పేర్కొంటూ జూలై 22న దానిని ఉపసంహరించుకుంది. సెంట్రల్ విస్టా ప్రాంతాన్ని పునరుద్ధరించే ప్రభుత్వ ప్రణాళికలో కొత్త పార్లమెంటు నిర్మాణం నవంబర్‌లోగా పూర్తి కావాల్సి ఉంది. అన్ని మంత్రిత్వ శాఖలకు ఉమ్మడి కేంద్ర సచివాలయం, ప్రధానమంత్రి కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ ఉన్నాయి.