Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : దుర్గా పూజా మండపంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మరణించిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో మరో 64 మంది గాయపడ్డారు. జిల్లాలోని నర్తువా గ్రామంలో ఏర్పాటుచేసిన మండపంలో ఈ దారుణం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో డిజిటల్ షో జరుగుతుందని, హలోజెన్ లైట్ అధికంగా వేడెక్కడం వల్ల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు సోమవారం తెలిపారు. ప్రమాద సమయంలో మండపం వద్ద 300 మందికిపైగా ఉన్నారని, వీరిలో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంపై ఔరారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పి అనిల్‌కుమార్ తెలిపారు.